ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులతో మరో వ్యక్తి మృతి చెందాడు. ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో మానసిక ఆందోళనకు గురైయ్యాడు.
వివరాల్లోకి వెళితే… మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి రుణం తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్న గంగాధర్ ఒక ప్రైవేట్ యాప్ ద్వారా రూ.3 లక్షలు రుణంగా తీసుకున్నాడు.
ఈఎంఐలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో అక్కన్నపేట అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం పొందుతూ గంగాధర్ మరణించాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.