పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఓజి(og)కూడా ఒకటి.సెప్టెంబర్ 27 న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ,పవన్ పొలిటికల్ కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటం వలన లేట్ అయ్యింది.పవన్ మాత్రం తన మరో అప్ కమింగ్ మూవీ’హరిహరవీరమల్లు’ షూటింగ్ లో కొన్ని రోజుల నుంచి పాల్గొంటున్నాడు.ఇందుకు సంబంధించిన వార్తలు చాలా రోజుల నుంచి అధికారంగా వస్తూనే ఉన్నాయి.

మరి ఇలాంటి టైం లో ఇప్పుడు ‘ఓజి’ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఓ జి లో ఒక స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ లో డి జె టిల్లు ఫేమ్ నేహాశెట్టి(neha shetty) చెయ్యబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.మరి ఇదే కనుక నిజమైతే ‘ఓజి’కి అదనపు ప్రత్యేకత చేకూరినట్టవుతుంది.ఎందుకంటే డిజె టిల్లు లో రాధిక క్యారక్టర్ లో నేహాశెట్టి యువకుల
హృదయాల్ని ఎంతగానో దోచుకుంది.దీంతో పవన్ తో ఆమె సాంగ్ చేయడం ఖాయమైతే ఆ సాంగ్  ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు.

ఇక నేహా శెట్టి న్యూస్ తో పాటు ఓజి కి సంబంధించిన మరో న్యూస్ కూడా వైరల్ అవుతుంది.ఓజి కి సంబంధించిన సాంగ్ ఒకటి ప్రస్తుతం థాయిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నటుగా తెలుస్తుంది.ఈ నేపథ్యంలో థాయిలాండ్ లో తెరెకెక్కిస్తున్న పాట నేహాశెట్టి దేనా లేక మరో పాటనా అనేది కూడా తెలియాల్సి ఉంది.ప్రభాస్ తో ‘సాహో’ ని తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో ఓజి తెరకెక్కనుండగా ఆర్ఆర్ఆర్ ని నిర్మించిన దానయ్య అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.పవన్ సరసన ప్రియాంక మోహన్ చేస్తుండగా ఇమ్రాన్ హష్మీ,శ్రేయారెడ్డి, తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here