పదేళ్ల బిఆర్ ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ కారణం, సరిగ్గా ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఇంజినీర్లను మాత్రమే విచారణ చేసిన కమిషన్ బుధవారం నుంచి ఐఏఎస్ అధికారులను విచారిస్తుంది. రెండో రోజు కూడా విచారణ కొనసాగింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను కమిషన్ విచారణ చేసింది. ఆమె బిఆర్కే భవన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. బుధవారం విచారణ కమిషన్ ఎదుట రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రజత్ కుమార్, ఎస్ కె జోషి హాజరయ్యారు.