వైకాపా నేత పేర్ని నాని భార్య పేర్ని జయసుధ రేషన్ బియ్యం మాయం కేసులో గురువారం మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. పేర్ని నాని భార్యకు చెందిన గోదాములో రేషన్ బియ్యం నిల్వలు ఉండేవి. కాకినాడ పోర్టులో విదేశాలకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుపడిన సంగతి తెలిసిందే. జయసుధ గోదాములో నుంచి 185 టన్నులు మాయం కావడంపై ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. బందరు పోలీస్ స్టేషన్ లో పేర్నినాని భార్య పేరు మీద క్రమినల్ కేసు నమోదైంది. జయసుధ అరెస్ట్ పక్కా అని తెలియడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 16న విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల నుంచి సిడిఫైల్ రాకపోవడంతో విచారణ ఈ నెల 19కి వాయిదాపడింది. తాజాగా శుక్రవారానికి వాయిదా పడినట్లు సమాచారం పేర్ని వైకాపాలో కీలక నేత కావడంతో రేషన్ బియ్యం గుట్టు కాలేదు. పౌరసరఫరా అధికారులు కూడా రేషణ్ బియ్యం పట్టుకోవడంలో వైఫల్యం చెందారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీగలాగితే డొంక కదిలింది.