స్టార్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)ప్రముఖ హీరోయిన్ రష్మిక(rashmika)తో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు  చాలా కాలం నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే.దీనిపై ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా గాని విజయ్ గాని రష్మిక గాని ఈ విషయంలో డైరెక్ట్ గా మాట్లాడిన దాఖలాలు లేవు.

ఇక విజయ్ లేటెస్ట్ గా ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.అందులో ఆయన మాట్లాడుతుప్రేక్షకులు నా పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.ఆ ఇంట్రెస్ట్ ని నా వృత్తిలో భాగంగానే భావిస్తాను.ఎలాంటి ఒత్తిడి కూడా తీసుకోకుండా కేవలం వార్తని వార్తగానే చూస్తాను.కాకపోతే నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతాను.ప్రపంచం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఒక సమయం,సందర్భం ఉంటుంది.అలాంటి రోజున సంతోషంగా నా పర్సనల్ విషయాన్నీ పంచుకుంటాను.అపరమితమైన ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు.ఒక వేళ అదే ఉంటే బాధ కూడా అంతే స్థాయిలో ఉంటుంది.మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే బాధని కూడా మోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.విజయ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కెరీర్ పరంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ‘జర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(gowtam tinnanuri)దర్సకత్వంలో ఒక వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.విడి 12(vd 12)అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here