పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తలకు ఎక్కిన పొగరు మొత్తం దిగింది. ఐసీసీ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై బిగ్ అప్‌డేట్ ఇచ్చేసింది. ఇది ఒక్క టోర్నమెంట్ మాత్రమే కాదు.. 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీలకు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో.. వివరాలు ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ నిర్వహించే టోర్నీ మ్యాచ్‌లను భారత జట్టు తటస్థ వేదికలో ఆడనుంది. అలాగే పాకిస్తాన్ కూడా ఇండియా నిర్వహించే టోర్నీ మ్యాచులన్నీ తటస్థ వేదికలో ఆడుతుంది. దీంతో పాటు 2024 నుంచి 2027 వరకు జరిగే అన్ని ఐసీసీ ఈవెంట్స్ హైదరాబాద్ మోడల్‌లో జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది. అలాగే ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2028ను పాకిస్తాన్ ఆతిధ్యం ఇవ్వనుంది.

తటస్థ వేదికపై భారత్ మ్యాచ్‌లు..

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మ్యాచ్‌లను భారత జట్టు తటస్థ వేదికపై ఆడనుండగా.. ఆ వేదిక ఏది అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తుండటంతో.. టీమిండియా మ్యాచ్‌లను అక్కడే నిర్వహించాలని భావిస్తోంది ఐసీసీ.

ఇతర టోర్నమెంట్‌లకు హైబ్రిడ్ మోడల్..

ఛాంపియన్స్ ట్రోఫీలోనే కాకుండా 2027 వరకు జరిగే ప్రతి ఐసీసీ టోర్నీలోనూ భారత జట్టు విషయంలో ఇదే విధానం వర్తిస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లో జరగనున్న ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడనుంది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ మాత్రమే ఆతిథ్యం ఇవ్వనుంది. 2026లో పురుషుల టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. ఇక ఈ రెండు టోర్నీల్లోనూ పాకిస్థాన్ జట్టు తమ మ్యాచ్‌లను భారత్ వెలుపల ఆడనుంది. అదేవిధంగా 2028 మహిళల T20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. ఇది కూడా హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరుగుతుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here