ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్యాష్ చేయాలని, బోజనం తర్వాత తన పిటిషన్‌పై విచారణ చేయాలని కోర్టును కోరారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఏసీబీ ఈ ఫార్మూలా రేసు వ్యవహరంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆయన హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోర్టును ఆయన కోరారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేటీఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, A3గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిగా పేర్కొన్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ (ఎఫ్‌ఓఈ) అనే విదేశీ కంపెనీకి హెచ్‌ఎండీఏ రెండు దఫాలుగా రూ.45 కోట్లు చెల్లించిందని ఏసీబీ ఆరోపించింది. అనధికారిక లావాదేవీలకు సంబంధించి అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.8 కోట్ల జరిమానా విధించిందని, ఆ తర్వాత గత ఏడాది చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెల్లించిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఫార్ములా ఈ రేసుపై శాసనసభలో చర్చ జరగాలని, దీంతో అసలు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు.
2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేటీఆర్ వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఈ రేసును నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.