ఫార్ములా -E కేసుపై ACB అడుగులు వేస్తున్నవేళ, కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్‌కు అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ చెప్పడంతో, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.15కి లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి.
హైకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అలగే డిసెంబర్ 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అయితే ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఫార్మూలా -E -రేస్‌లో తనపై వేసిన కేసును క్వాష్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు సాగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్‌పై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదన్నారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు FIRలో ఎక్కడా లేదన్నారు సుందరం. ఫార్ములా -E- రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తరువాత కేసు పెట్టారని కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి… కానీ ఏసీబీకి ఏం సంబంధమని ప్రశ్నించారు…?
ఇటు ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని విషయాలు పొందుపరచడం కష్టమంటూ కోర్టుకు తెలిపారు. విచారణ మొదలుకాకుండానే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారన్నారు. ఇరువురి వాదనలతో హైకోర్టు వారం రోజుల పాటు ఊరటనిస్తూ తీర్పు వెలువరించారు. 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తెలిపింది. డిసెంబర్ 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.